Trending Now

ఎన్నికల వేళ నిర్మల్ జిల్లాలో గంజాయి పట్టివేత..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 23 : లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎప్పటినుంచో ఎన్నికల ప్రవర్తన నియమవారిని అమలులోకి తీసుకువచ్చింది. నెల రోజులుగా ఎన్నికల ప్రవర్తన నియమాలు అమలులో ఉన్న నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు బైంసా పట్టణంలో గంజాయి బహటంగానే విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భైంసా పోలీసులు మంగళవారం మధ్యాహ్నం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో నలుగురు పరారైనట్లు భైంసా అదనపు ఎస్పీ శాంతి లాల్ పాటిల్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఎక్కడ కూడా ఎలాంటి మత్తు పానీయాలు పదార్థాలు ఇతరత్రా వాటిని విక్రయిస్తే సమాచారం మేరకు స్వాధీన పరుచుకొని తగిన విధంగా కేసులు నమోదు చేసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలలో బెల్టు షాపులను కొనసాగిస్తే కఠినమైనరీతిలో చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు.

Spread the love

Related News

Latest News