ప్రతిపక్షం, సిద్దిపేట, ఏప్రిల్ 23: సిద్దిపేట డీసీసీ కార్యాలయంలో జిల్లా ఓబీసీ సెల్ అద్యక్షులు డాక్టర్ సూర్య వర్మ అద్వర్యంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముధిరాజ్‌కు మద్దతుగా జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ సభ్యులు దరిపల్లి చంద్రం, మాజీ టౌన్ అధ్యక్షులు చొప్పదండి చంద్రశేకర్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కోఆర్డినేటర్ దాసరి రాజు హాజరయ్యారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ఇదొక గొప్ప అవకాశం అని డాక్టర్ సూర్యవర్మ అన్నారు.
మెదక్ పార్లమెంట్ నుంచి బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చి చాలా కాలం అయిందని అన్నారు. నీలం మధుకు పార్లమెంటు టిక్కెట్టు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీసీ సెల్ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు లక్ష మెజారిటీ వచ్చేలా ఎన్‌ఎస్‌యూఐ ,యూత్ కాంగ్రెస్, మైనార్టీ కాంగ్రెస్ నాయకులు అందరూ కృషి చేయాలని కోరారు.
వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటుపడే సరైన అభ్యర్థికి ఓటు వేసి మనలాంటి వారు మద్దతివ్వడానికి ఇదే సరైన సమయమని అన్నారు. సమావేశంలో సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలు, పట్టణ ప్రాంతాల్లో ఎలా ప్రచారం నిర్వహించాలనే దానిపై చర్చించారు. సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముమ్మరంగా ప్రచారం చేసి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం ముదిరాజ్‌కు భారీ మెజారిటీ తీసుకురావాలని ఐక్యంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి జంగోని శ్రీనివాస్, దిలీప్, మోతే కుమార్ ,బీసీ సెల్ మండల అద్యక్షులు గరిపల్లి వెంకటి, బంకా చిరంజీవి, మిద్దె ప్రసాద్, వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.