ప్రతిపక్షం, రామగిరి (మంథని), ఏప్రిల్ 23 : వన్యప్రాణుల కొరకు అమర్చిన విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి చెందిన విషాధ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంథని మండలంలోని బిట్టుపల్లి గ్రామానికి చెందిన జెట్టి కృష్ణ (30) మంగళవారం రాత్రి అదే గ్రామానికి చెందిన తోట మల్లయ్యతో కలిసి గోపాలపూర్ రోడ్డు వద్ద ఉన్న వరిపొలం వద్దకి వెళ్ళగా గుర్తు తెలియని వ్యక్తులు వన్యప్రాణుల కొరకు అమర్చిన విద్యుత్ తీగాలకు తగిలిన జెట్టి కృష్ణ విద్యుత్ ఘాతంతో అక్కడిక్కడే మరణించాడు. వెంటనే తోట మల్లయ్య ఇచ్చిన సమాచారంతో, సంఘటన స్థలానికి చేరుకున్న కృష్ణ తల్లిదండ్రులు కొడుకు మృతిని జీర్ణించుకోలేక బోరున విలపించారు. కృష్ణ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాధుతో ఘటన స్థలానికి చేరుకున్న మంథని ఎస్సై వెంకటకృష్ణ వివరాలు సేకరించారు. అనంతరం వన్యప్రాణుల కొరకు విద్యుత్ తీగలను ఆమార్చిన వ్యక్తుల కొరకు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. మృతుడు జెట్టి కృష్ణ తాడిచర్ల ఒసిపి లో వాల్వో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.