హైదరాబాద్ , ప్రతిపక్షం స్టేట్ బ్యూరో: సిద్దిపేటలోని 220 కేవీ సబ్ స్టేషన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సబ్‌ష్టేన్‌లో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. పీటీఆర్ పేలిపోవడం వల్లే సబ్ స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పామన్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. జరిగిన ప్రమాదంపై విచారణకు ఆదేశించామని మంత్రి చెప్పారు. కాగా, సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి 7గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రమాదంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు రేగాయి. దీంతో స్థానికులు భయ బ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిసింది. విద్యుత్ ట్రిప్ కావడంతో ప్రమా దం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం విష యం తెలియగానే సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.