నిర్మల్ మండలంలో ప్రచారం ప్రారంభించిన ప్రముఖ న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి
ప్రతిపక్షం, నిర్మల్ జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 25 : అదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించుకోవడమే లక్ష్యంగా ప్రణాళిక బద్ధమైన రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నామని ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి పేర్కొన్నారు .నిర్మల్ జిల్లా నిర్మల్ మండలంలోని కౌట్ల(కే) గ్రామంలో తన ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పదేళ్ల బిజెపి పాలనలో అందరికీ మోసాలు లభించాయి తప్ప ప్రయోజనం లేదని పేర్కొన్నారు. నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు అన్నింటిని దశలవారీగా అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనని చెప్పారు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వినూత్నమైన సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు సమన్యాయం ,సమసంక్షేమంతో ఆదుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ దేశానికి అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాలలో దోచుకోవడమే కాకుండా ప్రైవేటీకరణ చేసి అమాయక భారతీయులను అప్పుల పాలు చేసిందని విమర్శించారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా చేతు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంబరి గంగాధర్, కౌట్ల గ్రామ మాజీ ఉపసర్పంచ్ నర్సారెడ్డి రవి, అమీన్ లతో పాటు పలువురు ఉపాధి హామీ కార్మికులు గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.