బండి సంజయ్ ని భారీ మెజారిటీతో గెలిపించి మోడీకి గిఫ్ట్ ఇవ్వండి
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ భాయి పటేల్
ప్రతిపక్ష, కరీంనగర్, ఏప్రిల్ 25: దేశమంతా మోదీ గాలి వీస్తోందని, మోడీ పాలనను దేశ ప్రజలు మరొక్కసారి కోరుకుంటున్నారని బండి సంజయ్ ను కరీంనగర్ ఎంపీగా గెలిపించి ప్రధాని నరేంద్ర మోడీకి కానుకగా ఇవ్వాలని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ భాయ్ పటేల్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం నామినేషన్ల చివరి రోజున బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ భాయ్ పటేల్ తో పాటు కేంద్ర పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద నిర్వహించిన భారీ రోడ్ షోలో భూపేంద్రబాయి పటేల్ మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటికే గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇంకా 399 సీట్లలో మనం గెలిపించాలి. నరేంద్ర మోదీ నేతృత్వంలో 400 సీట్లలో విజయం సాధిస్తాం. మోదీజీ మూడోసారి ప్రధానమంత్రి కానున్నారు. మోదీ ని ఆశీర్వదించండి.. తెలంగాణ సంక్షేమాన్ని మోదీ చూసుకుంటారు. నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని పెంచారు. భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్నిఆపిన ఘనత నరేంద్ర మోదీ దే నని తెలిపారు.