Trending Now

దమ్ముంటే స్పీకర్ ఫార్మేట్‌లో రాజీనామా లేఖ ఇవ్వాలి..

ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది..

బీఆర్ఎస్‌ను రద్దు చేసే దమ్ము హరీష్ రావ్‌కు ఉందా..?

డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్

ప్రతిపక్షం, సిద్దిపేట, ఏప్రిల్ 26: ఆరు గ్యారంటీలు, రైతులకు 2 లక్షల రుణాపీ అమలు కు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా వున్నారని, హరీష్ రావు కు దమ్ముంటే, రైతులపై ప్రేముంటే వెంటనే స్పీకర్ ఫార్మేట్‌లో రాజీనామా చేసి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ అన్నారు. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కోట్ల రూపాయల అవినీతి చేసి, నాసిరకంగా ప్రాజెక్టు నిర్మించేస్తే, ప్రాజెక్ట్ నే కనుమరుగు ఐతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై విచారణ చేస్తుంటే ఈ ఎన్నికల వేళా దాని దృష్టి మరల్చడానికి ఈ తప్పుడు రాజీనామా డ్రామాలని మండిపడ్డారు. ఈ కాళేశ్వరం విచారణలో హరీష్ రావు మొదటి ముద్దాయిగా తేలడం ఖాయమన్నారు.

మీకు రైతులపై ప్రేమ ఉంటే ఎందుకు మీ ప్రభుత్వంలో రుణమాఫీ చేయలేదో ప్రజలకు చెప్పాలని మండిపడ్డారు. గతంలో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మరిచిపోయిన హరీష్ రావు, ఇప్పుడు రాజీనామా పేరుతో, స్పీకర్ ఫార్మేట్‌లో ఇవ్వకుండా, సీస పద్యాల లెక్క తప్పుడు రాజీనామా లేఖ రాసి డ్రామాలాడుతు సిద్దిపేట నియోజకవర్గంలో ఇజ్జత్ తీస్తుండని మండిపడ్డారు. ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఎన్ని తప్పుడు మాటలు చెప్పిన హరిష్ రావు ను రైతులు నమ్మే స్థితిలో లేరన్నారు.కాంగ్రెస్ పార్టీ వెంటనే రైతులు ఉంటారని, ఎంపీగా నీలం మధును భారీ మెజారిటీ తో గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేసారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్, ఉప అధ్యక్షులు సందబోయిన పర్షరం, సెక్రటరీ కోరిమి రాజు, బీసీ సెల్ మండల అధ్యక్షులు బత్తుల మల్లేశం, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉడుత జయంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్, ఎన్ఎస్యూఐ మండల ప్రధాన కార్యదర్శి మెడిపెల్లి రాజేందర్,సోషల్ మీడియా కోర్డినేటర్ నాయకులు సింగిరాల రాజు, కాలువ జగన్ దుగ్యని వెంకయ్య, పుచ్చాకాయల వెంకట్ రెడ్డి, మెట్ల అజయ్, బొల్లాబోయిన నాగరాజు, దోమోదర్ రెడ్డి, వెంకయ్య, సద్గురు, సికింద్లపూర్ శ్రీనివాస్ రెడ్డి, నక్క రాజు, తాళ్ల రాజు, మహేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News