Trending Now

ప్రజల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం..

పార్టీ శ్రేణులకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం.. ఏర్పాటైందని కేటీఆర్ అన్నారు. 2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారని.. ఆరోజు ఉన్న పరిస్థితుల్లో అనేక ప్రతికూలతలు ఉన్న తెలంగాణ కోసం పార్టీని ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట్రాలకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు.

తెలంగాణ ప్రజల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం సహకారమైంది. మా పార్టీ తరఫున ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేము.. ఆనాడు ఎన్ని రకాల కుట్రలు చేసినా సమైక్యవాద శక్తుల కుట్రలను ఛేదించి.. తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో వినిపించింది టీఆర్ఎస్ పార్టీనే అని తెలిపారు. సాధించుకున్న తెలంగాణకు సరైన నాయకత్వం కేసీఆర్ గారి దే అని 2014లో మా పార్టీకి అవకాశం ఇచ్చారు. తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశామని పేర్కొన్నారు. తెలంగాణలో సాధించిన ప్రగతిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ఒక సదుద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందని.. మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా వంటి రాష్ట్రంలో అద్భుతమైన స్పందన లభించిందన్నారు. దురదృష్టవశాత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేవని.. అయితే కేసీఆర్ గారు తలపెట్టిన ఏ పనినైనా వదలకుండా ముందుకు తీసుకుపోయిన చరిత్ర గత రెండున్నర దశాబ్దాలలో ప్రజలందరికీ తెలుసని తెలిపారు.

బోధించు, సమీకరించి, పోరాడు అనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని ముందుకు నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీనేనని.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరికీ… మాకు అందరికీ మద్దతుగా నిలబడిన తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోము ఇదే తీరుగా మా ప్రస్థానం సాగింది. భవిష్యత్తులోనూ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే ఉంటాం అని స్పష్టంచేశారు. తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అవసరం.. తెలంగాణ కంటు ఉన్న ఒక ఇంటి పార్టీ టీఆర్ఎస్.. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అన్న జయశంకర్ సార్ మాటలు ఎప్పటికీ వాస్తవంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పోరాడిన గులాబీ దండుకు ప్రాణాలు అర్పించి, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వందలాదిమంది తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలందరికీ రుణపడి ఉంటాం.. కేసీఆర్ గారు చూపిస్తున్న బాటలో మరోసారి పూనరంకితం అవుతామన్నారు.

Spread the love

Related News

Latest News