జిల్లా ఎస్పీ జానకి షర్మిల..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 27: ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఒకేసారి సాయత్రం 5 నుండి 7 గంటల వరకు నాకాబందీ చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానం వచ్చిన వాహనాలను పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు. అనుమానమున్న వ్యక్తులపై కూడా తగిన విధంగా నిఘా పెడుతున్నారు. జిల్లాలో ఉన్న ఎస్పీ స్థాయి నుండి కానిస్టేబుల్ వరకు అందరూ పాల్గొని ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా మొత్తం పోలీసు సిబ్బందిని రెండు విభాగాలుగా చేసి.. భైంసా సబ్ డివిజన్ లో ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, నిర్మల్ సబ్ డివిజన్ ని డీఎస్పీ గంగా రెడ్డి, జిల్లా ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో సిబ్బంది తనిఖీలను పర్యవేక్షించారు. ఈ తనిఖీలలో జిల్లా వ్యాప్తంగా భారీగా నగదు, మద్యం ఇతరత్రా పట్టుకోవటం జరిగిందని సమాచారం.