ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPL 2024లో నేడు రెండు మ్యాచులు జరగనున్నాయి. మ.3:30కి ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. రాత్రి 7:30కి లక్నో వేదికగా LSG, RR మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీతో మ్యాచ్‌లో ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ తరఫున లిజాద్ విలియమ్స్ ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా దూరమయ్యాడు.
IPL 2024 సీజన్‌లో ఇరుజట్లు ఇప్పటి వరకు ఢిల్లీ ఆడిన 9 మ్యాచ్‌లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉండగా.. ఆడిన 8 మ్యాచ్‌లో 3 విజయాలతో ముంబై 8వ స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఇరుజట్లకు గెలుపు తప్పనిసరి.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కుమార్ కుషాగ్రా, షాయ్ హోప్, రిషబ్ పంత్(w/c), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లిజాద్ విలియమ్స్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(c), టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, పీయూష్ చావ్లా, ల్యూక్ వుడ్, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార