ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPL 2024లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7:30గంటలకు మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచులు జరిగాయి. ఇందులో ఢిల్లీ 17 సార్లు, KKR 15 సార్లు విజయం సాధించాయి. చివరిగా తలపడిన 4 మ్యాచుల్లో 3-1తో ఢిల్లీదే పైచేయిగా ఉంది. KKR, DC తలో పది పాయింట్లతో పాయింట్ల పట్టికలో 2, 6 స్థానాల్లో ఉన్నాయి.
చెన్నై రివేంజ్.. SRH పరాజయం
నిన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 78 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి SRH 134 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు హెడ్(13), అభిషేక్(15) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. మార్క్రమ్(32), క్లాసెన్(20) ఫర్వాలేదనిపించినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. CSK బౌలర్లలో తుషార్ 4, పతిరన, ముస్తాఫిజుర్ చెరో 2, జడేజా, శార్దూల్ తలో ఒక వికెట్ తీశారు.