Trending Now

ఆర్టీసీ బస్సులో తనిఖీలు..

ప్రతి పక్షం, దుబ్బాక, ఏప్రిల్29: భూంపల్లి అక్బర్ పేట X రోడ్ బార్డర్ చెక్పోస్ట్ వద్ద సోమవారం భూంపల్లి ఎస్ఐ రవికాంత్ రావు, స్టాటికల్ సర్వేలెన్సు టీమ్స్ సిబ్బందితో కలసి వాహనాల తనిఖీలలో భాగంగా ఆర్టీసీ బస్సులో తనిఖీ నిర్వహించగా.. కామారెడ్డికి చెందిన మాధవరెడ్డి వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న రూ. 1,02,000/- రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల సందర్భంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎవరైనా 50 వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకొని వెళ్లేటప్పుడు వాటికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గ్రీవెన్స్ సెల్ లో ఇట్టి డబ్బులు డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు.సంబంధిత బాధితులు సరియైన ఆధారాలు తీసుకొని వెళ్లి డబ్బులు రిలీజ్ చేసుకోవాలని సూచించారు. చెక్ పోస్ట్ స్టార్ట్ కల్ సర్వే లైన్స్ టీమ్స్ వద్ద విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూడు షిఫ్టులుగా 24X7 విధులు నిర్వహించాలని తెలిపారు. రాత్రి సమయంలో వాహనాలు తనిఖీ చేసేటప్పుడు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున వడదెబ్బ తగలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Spread the love

Related News

Latest News