డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్
ప్రతిపక్షం, సిద్దిపేట, ఏప్రిల్ 29: సెక్యూలర్ రైటర్స్ ఫోరం సముహా రాష్ట్ర సదస్సు కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సులో హాల్ లోపలికి ఏబీవీపీకి చెందిన వారు వెళ్ళి బ్యానర్ చింపి, సభను అడ్డుకోని పసునూరి రవీందర్, ఫ్రోఫసర్ కాత్యాయని, నరేష్ కుమార్ షూపీ, మెర్సీ మార్గరెట్, భూపతి వెంకటేశ్వర్లు తదితరులపై దాడి చేయడం పిరికిపంద చర్య అని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దాడి చేయడమే కాదు అక్కడ ఉన్న మహిళలపై అనుచితంగా వ్యవహరించి తమ గుండాగురికి నిదర్శనమన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో యూనివర్శీటీలో విద్యార్ధి సంఘం పేరుతో ఏబీవీపీ ఆరాచాకాలు చేస్తోందని, ప్రశాంతంగా ఉన్న యూనివర్శీటీలలో అకడమిక్ వాతావరణం, భావ ప్రకటనను హరించే చర్యలకు పాల్పడటం తగదన్నారు. మొన్న సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడి, నిన్న హెచ్.సి.యు.లో గంజాయి, మద్యం మత్తులో విద్యార్ధులపై దాడి, నేడు వరంగల్ లో కవులు, రచయితలపై దాడి చేయడం హేయమైన చర్య లన్నారు. ఎన్నికలలో ఒడిపొతమనే భయంతోనే దాడులకు తెగబడుతునదన్నారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్చ, భావ ప్రకటన హక్కులను అడ్డుకుంటున్న బీజేపీని ఓడించి తగిన గుణ పాఠం చెప్పాలన్నారు. దాడులకు ప్రతి దాడి తప్పదని శంకర్ హెచ్చరించారు.