ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 30 : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్మల్ పర్యటన నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం ఎదుట గల ఖాళీ స్థలాన్ని సోమవారం రాత్రి ఆకస్మికంగా రాష్ట్ర మంత్రి సీతక్క, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు, కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా సీనియర్ నాయకులు మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, ఆయా శాఖల అధికారులు పరిశీలించారు. త్వరలో రాహుల్ గాంధీ నిర్మల్ పర్యటన నేపథ్యంలో సోమవారం రాత్రి పర్యటన ఏర్పాట్లను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పర్యవేక్షించారు. ఆదిలాబాద్ పర్యటనకు రాహుల్ గాంధీ వస్తున్న సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యాకర్తలను తీసుకురావాలని తెలిపారు. మంత్రి ఆకస్మిక పర్యటన తనకి తో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై సదరు ప్రాంతానికి చేరుకుంది మంత్రితో పాటు సంబంధిత శాఖల అధికారులు సదరు స్థలాన్నిపర్యవేక్షించారు.