ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPL 2024లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఇవాళ రాత్రి 07:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచులు జరగగా.. సీఎస్కే 15 సార్లు, పంజాబ్ 13 సార్లు విజయం సాధించాయి. కాగా, పాయింట్ల పట్టికలో చెన్నై 4, పంజాబ్ 8వ స్థానంలో ఉన్నాయి. మరి ఇవాళ్టి మ్యాచులో అసలైన కింగ్స్‌గా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి.
ముంబైపై లక్నో విజయం..
నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో లక్నో విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. లక్నో బ్యాటర్లలో స్టొయినిస్(62), రాహుల్(28) రాణించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ 2, నబి, తుషార, కోయెట్జీ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో లక్నో మూడో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు ముంబై ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.