ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 1 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీ లకు ఆ పార్టీ నాయకులు భారీ షాక్ లు ఇస్తున్నారు. నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లి గ్రామానికి బీజేపీ నాయకులు వెన్నెల సాగర్, బీఆర్ఎస్ పార్టీ కి చెందిన పరికిపండ్ల సంతోష్, దేవోళ్ల చిన్నయ్య ఆ పార్టీలకి రాజీనామా చేసి.. మాజీ గ్రామ సర్పంచ్ కోండ్రు రాం రెడ్డి సమీక్షంలో బుధవారం డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు సమక్షంలో 50 మంది కాంగ్రెస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ప్రజలు బుద్ధి చెప్పారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ కావడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ రామ్ రెడ్డి, దండు ప్రకాష్, దేవోళ్ల మహేష్, దేవోళ్ల రాజు, దేవోళ్ల మహిపాల్, పర్సా సాయన్న, కుమ్మరి పోశెట్టి ఉన్నారు.