Trending Now

కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలి..

నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 1: పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ బుధవారం ఉదయం నిర్మల్ డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు తో కలిసి జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, నిర్మల్ కూరగాయల మార్కెట్ లో ఉదయం ప్రచారం చేసారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కాసేపు వాకింగ్ చేసారు. కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులను, పండ్ల వ్యాపారులను కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పక్షపాతి అని ఏళ్ల వేళలా ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఆలోచించే పార్టీ అని గుర్తుచేశారు. నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశానని ఉద్యోగుల సమస్యలు తెలిసినదాననని, గత ప్రభుత్వం 317 ఆర్టికల్ తెచ్చి ఉద్యోగులను సమస్యలకు గురిచేసిందని అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజారంజక పాలన కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగ నన్ను అధిక మెజార్టీతో గెలిచెందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపనిచ్చారు. ఇందులో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతూ రాజేంధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్, చక్రవర్తి, పట్టణ అధ్యక్షులు నందేడపు చిన్ను, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, కౌన్సిలర్లు అన్వర్, కత్తి నరేంధర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News