నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్..
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసుపై భయపడనని, న్యాయ పోరాటం చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు ఓడిపోతున్నారన్న భయంతో నోటీసులతో నన్ను కట్టడి చేయాలని, మరో పక్క ప్రచారం చేయకుండా అడ్డు పడేందుకు నోటీసులు ఇచ్చారన్నారు. నోటీసులకు బయపడనని, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నానని, రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైతం తాను ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐఎఫ్ఎస్ఓ ఢిల్లీ పొలీసుల ముందు హాజర్యయ్యేందుకు సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. దీనికి కారణం అన్ని రాష్ట్రాల్లో సీఎం రేవంత్ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియా పోస్టు కేసులో న్యాయపరంగా ముందుకు వెళ్తాలని నిర్ణయించుకున్నారు. అందుకే తగిన గడువు కోరినట్లు తెలుస్తోంది. ఇక రేవంత్‌కు నోటీసులు ఇవ్వడానికి ప్రధాన కారణం అమిత్ షా చేసిన ఎన్నికల ప్రచారంలోని వీడియోగా చెబుతున్నారు పోలీసులు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ తొలగిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నట్లుగా ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కలకలం రేపింది. తెలంగాణలోని సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది. ఈ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులను విచారించాలని నిర్ణయించింది.
ఢిల్లీ పోలీసుల నోటీసులపై పీసీసీ లీగల్ సెల్ నేతలు సమాధానం ఇచ్చారు. సీఎంకు ఇచ్చిన నోటుసులపై కాంగ్రెస్ లీగల్ సెల్ సభ్యులు నాలుగువారాల గడువును కోరారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి మన్నే సతీష్‌తోపాటు నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్‌లకు కూడా రెండు వారాల గడువు కోరారు. సాంకేతికపరమైన అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలన చేసుకునేందుకు ఈ రెండు వారాలు గడువు కోరినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో పీసీసీ అధ్యక్షుడు, సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉండడంతో ఇవాళ విచారణకు రాలేమని వివరణ ఇచ్చింది పీసీసీ లీగల్ సెల్. సీఎంకు ఇచ్చిన నోటుసులపై హాజరయ్యేందుకు నాలుగువారాల గడువును కోరినట్లు సీఎం రేవంత్ తరఫు న్యాయవాది సౌమ్య గుప్తా తెలిపారు.