Trending Now

వామ్మో…ఇవేమి తిట్ల దండకాలు..?

తిట్లతో హీటెక్కుతున్న ఎన్నికల ప్రచారం

ఇప్పటికే మోదీ, రేవంత్​, కేసీఆర్​ మధ్య మాటల తూటాలు

గెలుపే లక్ష్యంగా మాటల తూటాలు పేలుతున్నాయ్​..!

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: రాష్ట్రంలో వేసవి ఎండలతో పాటు రాష్ట్రంలో రాజకీయ వేడి సైతం పెరిగిపోయింది. లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన మూడు పార్టీలు ఒకరిపై ఒకరు తిట్ట దండకానికి దిగారు. మూడు పార్టీలకు చెందిన ముఖ్యనేతు ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లు ఒకరిపై ఒకరు తిట్లదండకాలను ప్రదర్శిస్తుండ డంతో విన్న ఓటర్లు మాత్రం వామ్మో.. ఇవేమి తిట్లు అంటూ నివ్వెర పోతున్నారు. ఇక పోలింగ్​కు పట్టుమని పదిరోజుల గడువు మాత్రమే ఉండడంతో కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​ నేతల ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతి సవాళ్లతో తెలంగాణ దంగల్‌ నెక్ట్స్‌ లెవల్‌కి చేరింది. రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన డబులార్ ట్యాక్స్‌ కామెంట్స్‌ రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించాయి. రేవంత్, రాహుల్ గాంధీ ట్యాక్స్ అని అర్థమొచ్చేలా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. డబులార్‌ ట్యాక్సే నిజమైతే రేవంత్‌ రెడ్డిపైకి ఐటీ, ఈడీని ఎందుకు పంపరని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ వెంటనే ప్రశ్నించడంతో పాటు ఇరు పార్టీలు ఒకటి అయినందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్న రీతిగా ఆయన మాటలను వదిలేశారు.

పైకి నాటకాలు ఆడుతారుకానీ.. లోపలు వారు ఇద్దరూ ఒక్కటేనన్నారు. అయితే.. మోదీ, కేసీఆర్‌ ఇద్దరికీ సీఎం రేవంత్‌ రెడ్డి సైతం తన దైన శైలిలో స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు రెండూ వేర్వేరు కావన్నారు. బీజేపీని గెలిపిందేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా కవితకు బెయిల్​ మంజూరు కోసం రాష్ట్రంలోని 5 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుచేందుకు మోడీ, కేసీఆర్​ మధ్య ఒప్పందం కుదిరిందని, అందుకోసం అయిదు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు కేసీఆర్​ ఎన్నికల ప్రచారం నిర్వహించలేదని, అయితే కొడుకు, అల్లుడు మాత్రం నామ మాత్రంగా పర్యటన కొనసాగిస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్​కు చెందిన ఆగ్ర నేతలు ఈ వారంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రానున్న నేపథ్యంలో ఇంకా హీట్​ పెరిగే అశకాశం ఉంది.

Spread the love

Related News

Latest News