Trending Now

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి అల్లోల..

ప్రతిపక్షం,జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 2 : రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం మధ్యాహ్నం రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బుధవారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ ఏఐసిసి కార్యదర్శి దీప దాస్ మున్షీ సమీక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఎసిసి కార్యదర్శి దీపా దాస్ మున్షీ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి ఇతర కాంగ్రెస్ ఆయా విభాగాల పదాధికారులు, నాయకులతో కలిసి సుమారు అరగంట పాటు పలు విషయాలు చర్చించుకున్నారు. నిర్మల్ లో ఉన్న కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ బహిరంగ సభ, అదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచారము గెలుపు తదితర భవిష్యత్తు కాంగ్రెస్ కార్యాచరణ పై చర్చించినట్లు సమాచారం. ఈనెల 3న శుక్రవారం రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారిగా నిర్మల్కు విచ్చేస్తున్న సందర్భంగా మాజీ మంత్రి అల్లోల కాంగ్రెస్ శ్రేణులు అయినను ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Spread the love

Related News

Latest News