Trending Now

IPL 2024 : నేడు కోల్‌కతాతో ముంబై ‘ఢీ’

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఈరోజు IPLలో మరో ఆసక్తికరమైన మ్యాచ్ అలరించనుంది. ముంబై తనకు చావోరేవోగా మారిన మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడనుంది. 10మ్యాచుల్లో 3 గెలిచిన ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఎలాగైనా గెలవాలని ఆ జట్టు పట్టుదలతో ఉంది. మరోవైపు పాయింట్స్ టేబుల్‌లో టాప్ 2లో ఉన్న KKR సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ కావాలని భావిస్తోంది.

రాజస్థాన్‌కు షాక్.. SRH విజయం..

నిన్న జరిగిన ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌పై హైదరాబాద్ గెలుపొందింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RR 200 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లలో కమిన్స్, భువనేశ్వర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాజస్థాన్ బ్యాటర్లలో పరాగ్(77), జైస్వాల్(67) అర్ధసెంచరీలు చేశారు. SRH బౌలర్లలో భువనేశ్వర్ 3, నటరాజన్, కమిన్స్ తలో 2 వికెట్లు తీశారు.

Spread the love

Related News

Latest News