కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 4 : పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్మల్ జిల్లా కేంద్రానికి వస్తున్నందున ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేసే బాధ్యత మన అందరిని జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి పేర్కొన్నారు శనివారం నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని అనంతపేట, నీలాయిపేట గ్రామాలలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టో పేర్కొన్నట్లే ప్రతి ఏడాది ప్రతి అర్హురాలైన మహిళకు లక్ష రూపాయల నగదు సాయంతో పాటు ఉపాధి కూలీలకు రోజు కూలి రూ. 400కు పెంచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుందని చెప్పారు. నిరుద్యోగ యువతకు ప్రతినెల రూ. 8,500 గౌరవ వేతనం కింద అందజేయడం జరుగుతుందని చెప్పారు.
ఇంటి స్థలము ఉండి ఇంటి స్థలం లేని వారికి కూడా ఇల్లు నిర్మాణం కోసం ఐదు లక్షల నగదు పథకం తో పాటు ఇతర సంక్షేమ పథకాలు కార్యక్రమాల ద్వారా అర్హులైన వారందరూ లబ్ధి పొందిన కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నిటిని దశలవారీగా అమలు చేస్తున్నారని అదే మాదిరి భవిష్యత్తు ప్రధాని రాహుల్ గాంధీ కూడా దేశంలోని అన్ని వర్గాలకు సదరు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారన్నారు. అదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణక్కను గెలిపించుకునే బాధ్యత మన అందరి దాన్ని స్వాతంత్రానంతరం తొలిసారిగా ఎంపిక ఒక మహిళకు అవకాశం ఇచ్చిన ఘనత రాహుల్ గాంధీకి దక్కిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంబరి గంగాధర్, వాసవి, చిన్న లింగన్న, సాయన్న, సాయి కృష్ణ, హరికృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.