ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఇవాళ ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సాయంత్రం 7.30 గంటలకు జరగనుంది. ఈ సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డులు బద్దలు కొడుతున్న హైదరాబాద్ ప్రస్తుతం 300 స్కోరుపై కన్నేసింది. హెడ్, అభిషేక్, క్లాసెన్, నితీశ్ భీకర ఫామ్‌లో ఉండటం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం. మరోవైపు వరుస ఓటములతో ముంబై డీలా పడింది. 11 మ్యాచ్‌ల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.
కోల్‌కతా భారీ విజయం..
లక్నోతో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ భారీ విజయం సాధించింది. 236 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నో 16.1 ఓవర్లు ఆడి 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో 98 పరుగుల తేడాతో కోల్‌కతా విక్టరీ సాధించింది. లక్నో జట్టులో స్టొయినిస్ (36), రాహుల్ (25) మాత్రమే ఓ మాదిరిగా ఆడారు. మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. సునీల్ నరైన్ (39 బంతుల్లో 81 రన్స్, 1/22) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు.
టేబుల్ టాపర్‌గా కోల్‌కతా..
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా భారీ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మొత్తం 16 పాయింట్లు సాధించి మెరుగైన రన్‌రేట్‌తో టేబుల్ టాపర్‌గా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ (16 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై (12), హైదరాబాద్ (12), లక్నో (12), ఢిల్లీ (10), బెంగళూరు (8), పంజాబ్ (8), గుజరాత్ (8), ముంబై (6) ఉన్నాయి.