Trending Now

లారీ సమస్యల పరిష్కారానికి కృషి.. సీఎం రేవంత్

కాంగ్రెస్ పార్టీకి లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు

లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ సాదిక్ వెల్లడి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా లారీ యజమానుల సమస్యలను పరిష్కరిస్తామని, రవాణా రంగం మెరుగుదల కోసం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన సమస్యలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుగుల రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ రామినేని, ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ సాదిక్, జగన్నాథ్ రెడ్డి, సహాయ కార్యదర్శి నవాజ్ గోరీ, ఖాజ హైదరి, ఎండి సలీం, ఆల రామారావు తదితరులు సోమవారం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలుసుకొని మాట్లాడారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రి కొండ సురేఖ తదితరులు ఉన్నారు. లారీ యజమానుల సమస్యలను మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యలను అమలు చేస్తానని హామీ ఇచ్చారని, రేపు జరగబోవు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు మద్దతు ఇచ్చి ప్రచారం చేసి ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేయుచున్నామని పోస్టర్లను సైతం విడుదల చేశారు.

ఈ సందర్భంగా లారీ ఓనర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ సాదిక్ మాట్లాడుతూ.. రవాణా రంగం అభివృద్ధి కోసం లారీ ఓనర్ అసోసియేషన్ ఎంతో కృషి చేస్తుందని అన్నారు. రవణ రంగంలో ఏర్పడిన సంక్షోభాన్నిరూపుమాపి రవాణా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ అసోసియేషన్ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తామని సయ్యద్ సాదిక్ స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News