Trending Now

పోయింది కొంతమంది లీడర్లే.. క్యాడర్ మాత్రం మిగిలే ఉంది

నిర్మల్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి తరలివచ్చిన వేలాది మంది బీఆర్‌ఎస్ శ్రేణులు

నాయకులలో కార్యకర్తలలో నూతనోత్సవాన్ని నింపిన సదస్సు

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 6 : పదేళ్లపాటు బీఆర్ఎస్ లో వివిధ పదవులు అనుభవించిన అగ్రస్థాయి నాయకులు ఎందరో బీఆర్‌ఎస్ ను వీడి హై కాంగ్రెస్, బీజేపీలకు వెళ్లిపోగా.. ఇక నిర్మల్ లో బీఆర్‌ఎస్ లేకుండా పోయిందని పుకార్లు, షికార్లు చేస్తుండగా.. నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన నిర్మల్ నియోజకవర్గం భూత్ స్థాయి కార్యకర్తల అవగాహన సదస్సులో ఒకేసారి వేలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆ ప్రాంగణమంతా నిండిపోయి గులాబీమయమైంది. ప్రధానంగా బీఆర్ఎస్ పదేళ్ల ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా రెండు పర్యాయాలు వ్యవహరించిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు నిర్మల్ మున్సిపల్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా గ్రంథాలయాల మాజీ చైర్మన్ లతో నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన వివిధ హోదాలలో కొనసాగిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులుగా వ్యవహారిస్తున్న వారు అభిమానులు, అనుచరులు ఎంతోమంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లిపోయారు.

ఇక ఏమి మిగిలి ఉంది బీఆర్ఎస్ నిర్మల్ లో ఖాళీ అయిందన్నా గట్టి విశ్వాసం ప్రజలలో నేలుకున్న తరుణంలోనే నిర్మల్ లో నిర్వహించిన పూర్తిస్థాయి కార్యకర్తల సమావేశం ఒకేసారి వేలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులతో నిండిన పోవడం చర్చనీయాంశంగా మారింది. లీడర్లే క్యాడర్ మాత్రం కాదని అక్కడ పాల్గొన్న వారందరూ వ్యాఖ్యానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. పోయింది కొంతమంది లీడర్లే.. బీఆర్ఎస్ లో నుండి దరిద్రం పోయింది.. ధైర్యవంతులే ఉన్నారని ఇప్పటికే చాలా చోట్ల లలో బీఆర్ఎస్ అభిమానులు కట్టర్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని సభాముఖంగా వ్యాఖ్యానించారు. ఇదే స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఈనెల 9న నిర్మల్ జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో కార్యక్రమానికి కూడా విచ్చేసి ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు కోసం కష్టపడాలని పలువురు నాయకులు చేశారు.

Spread the love

Related News

Latest News