నిర్మల్‌లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 6 : తమ రాజకీయ అవసరాల కోసం, వ్యక్తిగత, ఆస్తుల పరిరక్షణ కోసం పార్టీలను వాడుకొని వదిలేసే అవకాశవాదులకు తగిన విధంగా చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని రాష్ట్ర మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ బాపు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి కష్టపడే వ్యక్తి అని ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి కార్యకర్త ముందుకెళ్లాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన త్యాగాలు పోరాటాలు మహోన్నతమైనవని చెప్పారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీసీ, బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే మరెక్కడ లేని విధంగా వినూత్నమైన సంక్షేమ పథకాలు కార్యక్రమాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ పొందిందని చెప్పారు. బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఎంతోమంది ఆయా రాజకీయ పక్షాలను వీడి బీఆర్ఎస్లకు వచ్చి పదేళ్లు కాయ పదవులను అనుభవించి ఇప్పుడు ఇతర పార్టీలలో చేరడం వారి అవకాశా రాజకీయాలను బట్టబయలు చేసిందన్నారు. ఎవరు ఎటు వెళ్లిపోయినా ఉన్న వారంతా ధైర్యంగా ఉండి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు కోసం కష్టపడాలని సూచించారు.
వెళ్లిన వారందరూ దరిద్రులు మిగిలి ఉన్న వారందరూ ధైర్యవంతులు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మోయలేని రీతిలో అబద్ధాలు ఆడుతూ ప్రజలను మధ్యపెట్టి అధికారాన్ని చెల్లాయిస్తున్నాయని ఆరోపించారు. ఒకరు దేవుళ్ళపై ప్రమాణాలు చేస్తుంటే.. మరొకరు దేవుళ్ల పేరు చెప్పుకొని రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ.. తనకు పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలు రెండుసార్లు శాసనసభ్యునిగా అవకాశం కల్పించారని మరోసారి ఎంపీగా అవకాశం కల్పిస్తే జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై ఉన్న నమ్మకంతో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం తనను ఎంతగానో గర్వించేలా చేసిందని చెప్పారు.
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఎన్నడు లేని విధంగా సంక్షేమ పథకాలు కార్యక్రమాల ద్వారా కోట్లాది రూపాయలు కేటాయించుకొని అన్ని వర్గాల ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. అవకాశవాద రాజకీయాలతో కాంగ్రెస్, బీజేపీలు కనీసం పార్టీలో సభ్యత్వం లేని వారికి కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలలో టికెట్లు ఇచ్చే అభ్యర్థులుగా ప్రకటించడం వారి ఆ నైతిక రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ఏడు నియోజకవర్గాలలో బలమైన క్యాడర్ ఉన్న ఏకైక రాజకీయ పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని ఇప్పటికీ కాంగ్రెస్ లో బూత్ స్థాయి సభ్యత్వం లేని వారే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. గతంలో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సోయం బాబురావు జిల్లాకు రావలసిన ప్రాజెక్టుల గురించి పలుమార్లు పోరాడిన ఈ బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని ఇప్పుడేమో అది చేస్తాం ఇది చేస్తామంటూ మోసగిస్తూ.. గతంలో రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా పదవులు అనుభవించిన వ్యక్తికి పోటీలో దించి మాయమాటలు చెబుతున్నదని ఎద్దేవా చేశారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్మల్ జిల్లా ఇంచార్జ్ యునూస్ ఎక్బానీ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో కూడా బీఆర్ఎస్ కు క్యాడర్ బలంగా ఉందని బూత్ స్థాయి నుంచి ఓటర్ లిస్ట్ లను పున పరిశీలించి మనోధైర్యంతో కష్టపడితే ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు సులభతరమవుతుని సూచించారు. టిఆర్ఎస్ లీడర్లు క్యాడర్ బాధ్యతతో ప్రణాళిక బద్ధమైన భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా భవిష్యత్తు బీఆర్ఎస్ దేనిని భరోసా కల్పించారు. ఈ సమావేశంలో మాజీ డిసిసిబి చైర్మన్ రాం కిషన్ రెడ్డి, టిఆర్ఎస్ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, పట్టణ ప్రధాన కార్యదర్శి, మాజీ రాష్ట్ర హాజీ కమిటీ సభ్యులు మహమ్మద్ నజీరుద్దీన్, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు డా.యు. సుభాష్ రావు,సోన్ జడ్పీటీసీ జీవన్ రెడ్డి, లతో నిర్మల్ పట్టణ, సారంగాపూర్, దిలావర్ పూర్ ,లక్ష్మణ్ చాంద, సోన్, మామడ, నర్సాపూర్ (జి) ల ప్రజా ప్రతినిధులు ,మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ ఆయా విభాగాల పదాధికారులు, సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయా పార్టీల నుండి బీఆర్ఎస్లో చేరగా వారికి మాజీ మంత్రి జోగు రామన్న ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కులు బీఆర్ఎస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
9 న నిర్మల్‌కు కేటీఆర్ రోడ్ షో..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈనెల 9న గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోనిశ ఆయా ప్రధాన కూడళీలలో నిర్వహించే ఎన్నికల ప్రచార రోడ్ షో కార్యక్రమాలలో పాల్గొంటారని బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా సమన్వయకర్త కె. రాం కిషన్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి పెద్ద ఎత్తున జన సమీకరణతో పాటు పార్టీ ఆయా విభాగాల బాధ్యులు తరలిరావాలని కోరారు.