రాష్ట్రంలో అగ్ర నేతల ప్రచారం..
రాహుల్, ప్రియాంక ప్రచారం..
పీఎం మోదీ, అమిత్ షా సైతం..
నేతల ప్రచారంతో దద్దరిల్లనున్న తెలంగాణ
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్ బ్యూరో: లోక్ సభ పోలింగ్ కౌంట్ డౌన్ మొదలైంది. ఇక ప్రచారానికి మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణపైనే దృష్టి సారించారు. రాష్టంలో విజయమే లక్షంగా ప్రచారానికి పదును పెడుతూ దూసుక పోతున్నారు. ఈ ఐదు రోజులలో కాంగ్రెస్ ఆగ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విస్తృత ప్రచాశ్రం చేయనున్నారు. ఈనెల 9న రాహుల్ గాంధీ, 10 న ప్రియాంక గాంధీ ప్రచారం చేయ నున్నారు. అలాగే పీఎం నరేంద్ర మోదీ, అమిత్ షా తో పాటు బీజేపీ రాష్ట్రాల్లా సీఎంలు ప్రచారానికి వస్తున్నారు.
అగ్ర నేతల రాకతో పెరుగనున్న జోష్..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ తోపాటు అన్ని పార్టీలకు చెందిన అతిరథ మహారధులు తెలంగాణపైనే ఫోకస్ పెట్టారు. 8వ తేదీన తెలంగాణకు రాబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉదయం తొమ్మిది గంటలకు వేములవాడ, పదిన్నరకు వరంగల్ జిల్లా మడికొండలో పర్యటిస్తారు. పదవ తేదీ మళ్లీ తెలంగాణకొచ్చి.. మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేట, సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగే బహిరంగసభల్లో ప్రసంగిస్తారు. నేడు (సోమవారం ) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పెద్దపల్లి, భువనగిరి, నల్గొండల్లో ప్రచాశ్రం చేసారు. వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించే రోడ్ షోల్లో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గాంధీ ఫ్యామిలీని రంగంలోకి దింపుతోంది. చివరి విడతను సక్సెస్‌ఫుల్‌గా ముగించాలని ప్లాన్ చేశారు. ఏఐసీసీ మాజీ ప్రెసిడెంట్ రాహుల్‌గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ తెలంగాణలో పర్యటిస్తారు. తొమ్మిదో తేదీన రాహుల్ గాంధీ కరీంనగర్, సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలకు హాజరవుతారు. ప్రియాంకగాంధీ 10న తెలంగాణకు వస్తున్నారు. ఎల్లారెడ్డి, తాండూరులో పర్యటించి అదేరోజు షాద్ నగర్ లో రోడ్‌షో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు.
రేవంత్ సుడిగాలి పర్యటన..
ఇక రేవంత్ రెడ్డి తీరిక లేకుండా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ప్రతి రోజు రెండు చోట్ల సభలు, రోడ్ షోలలో పాల్గొంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సవాస్ని నింపుతున్నారు.
కేసీఆర్ సైతం..
ఓటమి నుంచి తేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర జోరుగా సాగుతోంది. కనీసం 3 సీట్లు అయినా గెలుచు కోవాలన్న ప్రసిస్టన్స్ చేస్తున్నారు. బస్సు యాత్ర్స్కు భారీగా జనం రావడంతో ఇంకా దూసుకెళ్తున్నారు. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచార్సం సాగిస్తున్నారు.
బీజేపీ విస్తృత ప్రచారం..
బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూనే సమయం దొరికినప్పుడల్లా ఇతర నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ఏదే ఎంసినప్పటికీ కౌంట్ డౌన్ ప్రార్శంభం కస్వాడ్స్తో అన్ని పార్టీలు అగణేతలను ప్రచారంలో దించాయి. అలాగే గెలుపే లక్షంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.