ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 7: సిద్దిపేట జిల్లా కోహెడ ఎస్ఐ తిరుపతి సిబ్బందితో కలిసి గొట్లమిట్ట గ్రామ శివారులో నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో చింతలపల్లి రమణ తన వాహనంలో రూ. 2,00,000/- ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని వెళుతున్న డబ్బులను సీజ్ చేశారు. బొమ్మడేవేన శ్రీనివాస్, తన వాహనంలో రూ. 66,000 వేల రూపాయలు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని వెళ్ళుచుండగా సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కోహెడ ఎస్ఐ తిరుపతి మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం లోక్ సభ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట పట్టణంలో సర్ప్రైజ్ వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుంది. రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకొని వెళ్లేటప్పుడు వాటికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. సీజ్ చేసిన డబ్బులను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గ్రీవెన్స్ కమిటీకి అప్పగించడం జరిగిందని తెలిపారు. అక్కడ డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపించుకుని డబ్బులు రిలీజ్ చేసుకోవచ్చని సూచించారు.