ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 7 : మేడిపల్లి, పోచంపాడ్, భాగ్యనగర్ గ్రామంలో ఉపాధి కూలీలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వివరించిన నిర్మల్ మండల ఎంపీపీ కోరిపెల్లి రామేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆత్రం సుగుణ నిరంతరం ప్రజల కోసం పోరాడే నాయకురాలని.. ప్రజా సమస్యలపై పోరాడిన పోరాట నారీ ఆత్రం సుగుణ అని పేర్కొన్నారు. అదేవిధంగా ఆమెపై 52 కేసులు మోప్పి ఆనగదొకాలని చూసిన గత ప్రభుత్వాలను సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యలపై పోరాడిన గొప్ప నాయకురాలు అని అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మన సమస్యలపై ఢిల్లీ లో కొట్లడుతుందని అన్నారు. ఆమె ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లో ఉంటూ.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా జీవనం సాగిస్తూ ప్రజా సమస్యలపై కొట్లాడుతున్నదని తెలిపారు.
అలాంటి వారికి మనం ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తపదన్నారు. రేవంత్ రెడ్డి మాట ఇస్తే మడమ తిప్పనీ వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో; కాంగ్రెస్ పార్టీ నిర్మల్ మండల కన్వీనర్ కుంట వేణు గోపాల్, ఎంపీటీసీ విలాస్, సర్పంచులు, పద్మాకర్, భూమయ్య, భూమేశ్, సాయన్న పీఎసీఎస్ వైస్ చైర్మన్ రాజా రెడ్డి, మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.