నిర్మల్ జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు రాచకొండ సాగర్..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 8 : టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ను సహించేది లేదంటూ నిర్మల్ బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ స్పష్టం చేశారు. బుధవారం స్థానికంగా ఆయన మాట్లాడారు. ఈనెల 5న ఆదివారం నిర్మల్ లో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రమంత్రి అమిత్షాలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమైనవని పేర్కొన్నారు. ఒకవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే మరోవైపు జన జాతర సభలో అద్దంకి దయాకర్ ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడడం సరికాదన్నారు. గౌరవప్రదమైన పదవులలో ఉన్న ప్రధానమంత్రి, హోం మంత్రిలను ఉద్దేశించి మాట్లాడడమే కాకుండా దేవి, దేవతలను కూడా కించపరిచిన మాట్లాడిన అద్దంకి దయాకర్ పై పూర్తి ఆధారాలతో నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
హిందూ సనాతన ధర్మ పరిరక్షణ తో పాటు దేవి, దేవతల ను అగౌరవపరిచే వారిపై రాజ్యాంగబద్ధమైన రీతిలో పోరాడుతామని రాచకొండ సాగర్ పేర్కొన్నారు. ఫిర్యాదును పున పరిశీలించి నా నిర్మల్ పోలీసులు అయిన పై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లు పాల్గొన్న ఈ సభలో అద్దంకి దయాకర్ ఈ తరహాలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వెనుక ఉన్న రహస్యమేమిటో న్యాయస్థానం ద్వారా తేల్చి చెప్తామని పేర్కొన్నారు. అద్దంకి దయాకర్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని లేకుంటే హిందూ సంస్థలని ఏకమై ఆందోళనకు దిగవలసి వస్తుందని పేర్కొన్నారు. అద్దంకి దయాకర్ పై ఆధారాలతో సహా చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల భారతీయ జనతా పార్టీ, దళిత మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని రాచకొండ సాగర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.