ప్రతిపక్షం, గజ్వేల్, మే 10: శివుడే సత్యం, శివుడే నిత్యం అని నమ్మిన బసవేశ్వరుని జయంతి పురస్కరించుకుని పసుపు బియ్యాన్ని ఉపయోగించి వినూత్న ఆలోచనతో బసవేశ్వరుని భారీ చిత్రాన్ని అద్భుతంగా శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్నఅవార్డ్ గ్రహీత రామకోటి రామరాజు రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బసవేశ్వరుడు చిన్నతనం నుండి దైవ చింతన ఉండేదని. జంగముడిగా జన్మించిన ఆయన ఆది నుండి శివతత్వాన్ని తనలో జీర్ణింపజేసుకున్న మహనీయుడన్నాడు. గత 2సంవత్సరాల క్రితం బియ్యంతో, మరోసారి అవాలతొను చిత్రించానన్నాడు.