ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఇవాళ కోల్‌కతాతో ముంబై తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. కోల్‌కతా వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచింది. దాదాపుగా ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. మరోవైపు ముంబై ఈ సీజన్‌లో దారుణ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. ఇప్పటివరకు ఆ జట్టు 12 మ్యాచ్‌లు ఆడి నాలుగు గెలిచి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
చెన్నైపై గుజరాత్ ఘన విజయం..
చెన్నైతో నిన్న జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం సాధించింది. 35 పరుగుల తేడాతో చెన్నైను మట్టికరిపించింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లు ఆడి 196/8 పరుగులకే పరిమితమైంది. జట్టులో మిచెల్ (63), మొయిన్ అలీ (56) అర్థ సెంచరీలతో రాణించారు. చివర్లో ధోనీ (26) సిక్సర్లతో చెలరేగినా అప్పటికే సమయం మించిపోయింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లు తీశారు. రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.
చెన్నైతో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సంచలనం సృష్టించారు. IPLలో ఫస్ట్ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం(210 రన్స్) నెలకొల్పిన రెండో జంటగా నిలిచారు. ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు బాదడం మరో విశేషం. 2022లో KKRతో మ్యాచ్‌లో LSG ఓపెనర్లు కేఎల్ రాహుల్, డికాక్ తొలి వికెట్‌కు అజేయంగా 210 పరుగులు చేశారు.
చెన్నై ఓటమి.. ఆ జట్లకు గుడ్ న్యూస్?
గుజరాత్‌తో మ్యాచ్‌లో చెన్నై ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ కూడా పడిపోయింది. దీంతో ఢిల్లీ, బెంగళూరు, లక్నో, గుజరాత్ జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఈ నాలుగు జట్లకూ ఇంకా ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఇప్పటివరకు 59 మ్యాచ్‌లు ముగిసినా ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్స్‌కు అధికారికంగా చేరుకోలేదు. ముంబై, పంజాబ్‌కు తప్ప అన్ని జట్లకూ ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.