Trending Now

నేడు తెలంగాణ పర్యటనకు ప్రియాంక గాంధీ..

ప్రతిపక్షం, హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండూర్, కామారెడ్డిలలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు పఠాన్‌చెరు కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తాండూర్ జన జాతర సభకు ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి హాజరవుతారు. సాయంత్రం 3.15 గంటలకు ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డిలో రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాగా, హోరాహోరీగా సాగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. శనివారం సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, వారి తరపున స్టార్‌ క్యాంపెయినర్లు ప్రచారాన్ని హోరెత్తించారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు చేరువయ్యేందుకే అన్ని పార్టీల నాయకులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. బహిరంగ సభలను తగ్గించిన పార్టీలు కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్‌షోల ద్వారా ప్రచారాన్ని హోరెత్తించాయి. స్టార్‌ క్యాంపెయినర్లు సైతం సమ్మేళనాలు, రోడ్‌షోలకే ప్రాధాన్యమిచ్చి ప్రచారం నిర్వహించడం ఈసారి మారిన సరళికి నిదర్శనం. వీటికి తోడు పార్టీల మ్యానిఫెస్టోలు, నినాదాలు, లోకల్‌ మ్యానిఫెస్టోలతో పాటు ప్రధాని మొదలు సీఎం, మాజీ సీఎం, ఆయా పార్టీల స్టార్‌ క్యాంపెయినర్ల సంభాషణల వీడియోలను సోషల్‌మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, వాట్సప్‌ గ్రూప్‌ల ద్వారా తమ వాణిని అభ్యర్థులు విస్తృతంగా ఓటర్ల దరికి చేర్చారు. ఓటర్లను అభ్యర్థిస్తూ వాయిస్‌ మెసేజెస్‌ ముంచెత్తాయి.

Spread the love

Related News

Latest News