ప్రతిపక్షం, జుక్కల్, మే 11: ఉపాధిహామీ చట్టాన్ని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండల కాంగ్రెస్ నాయకులు మల్లప్పపటేల్ అన్నారు. కాటేపల్లి గ్రామ శివారులో ఉపాధిహామీ కూలీలతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జరుగనున్న ఎంపీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కార్ కు ఓటేయాలని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధిహామీ కూలీలకు రోజుకు 400 రూపాయలు కూలి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థి బీబీ పటేల్ పదేళ్లు ఎంపీ గా ఉండి.. ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు. కనీసం గ్రామాలకు వచ్చి పలకరించిన సందర్భంలేదని తెలిపారు. ఇక బీఆర్ యస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కనీసం ఎవరికి పరిచయం కూడా లేడన్నారు. బీఆర్ఎస్ పదేళ్ళ కాలంలో చేసిన అభివృద్ధి ఏమీలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మొహిద్దిన్ పటేల్, సొసైటీ వైస్ చైర్మన్ గంగాగౌడ్, డైరెక్టర్ పెంటన్న, చాంద్ పాషా, సాయులు, చోటు పటేల్, చౌటకూరి శంకర్, ఆకుల రాంచందర్, నారాగౌడ్, రావి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.