Trending Now

బీజేపీ తెలంగాణకు ఏం ఇచ్చింది..?

ట్విట్టర్‌లో వినూత్నంగా పోస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గత పది సంవత్సరాలలో కేంద్రంలోని బీజేపీ పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని, గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ మేరకు విభజన హామీల అమలు, కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన ఇతర అంశాలపై ట్విట్టర్ లో వినూత్నంగా పోస్ట్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల్లో సరైన వాటా, నీళ్లు, నిధులు అడిగితే, బీజేపీ మాత్రం గాడిద గుడ్డు ఇచ్చిందని ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి విభజన చట్టం హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ పేర్కొంది.

రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ITIR & ఇండస్ట్రియల్ పార్కులు, హైదరాబాద్ కు ఇండస్ట్రియల్ కారిడార్లు రాకపోవడం, కరీంనగర్, వరంగల్ స్మార్ట్ సిటీలుగా కాకపోవడం వంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. యువత భవితకు ఉపయోగపడే IIIT, మెడికల్ కాలేజీలు,IIM, NID విద్యాలయాలు, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ విమర్శించింది. పదేండ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం.. ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం అంటూ హస్తం గుర్తుకు ఓటేద్దాం- కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అని రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చింది.

Spread the love

Related News

Latest News