Trending Now

మీ ఓటు వేరే వాళ్లు వేస్తే ఏం చేయాలి..?

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మీ ఓటును వేరే వాళ్లు వేసినట్లు గుర్తిస్తే వెంటనే ప్రిసైడింగ్ అధికారిని కలవాలి. ఓటర్ ఐడీ లేదా మరేదైనా గుర్తింపు పత్రం సమర్పించాలి. అధికారి ఇచ్చే ఫామ్ 17(బి) పై పేరు రాసి, సంతకం చేయాలి. ఆ తర్వాత టెండర్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దానిపై ఓటు వేయాలి. ఆ పేపర్‌ను ప్రత్యేక కవర్‌లో కౌంటింగ్ కేంద్రానికి పంపిస్తారు. సెక్షన్ 49(పి) ప్రకారం పొందే ఈ ఓటును టెండర్/ఛాలెంజ్ ఓటు అంటారు. దీనిని EVM ద్వారా వేయడం కుదరదు.

రేషన్ కార్డు చూపించి ఓటు వేయొచ్చా..?

ఓటరు జాబితాలో మీ పేరు ఉన్నప్పటికీ మీకు ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 ఐడీ కార్డుల్లో దేని సహాయంతోనైనా ఓటు వేయొచ్చు. అయితే రేషన్ కార్డు తీసుకెళ్లి ఓటు వేసేందుకు మాత్రం అర్హత ఉండదని అధికారులు తెలిపారు. రేషన్ కార్డును గుర్తింపు కార్డుగా పరిగణించబోమని స్పష్టం చేశారు. ఆధార్, పాస్‌పోర్ట్, పాన్‌కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పెన్షన్ కార్డు, MNREGA జాబ్ కార్డు లాంటివి తీసుకెళ్లొచ్చు.

Spread the love

Related News

Latest News