Trending Now

ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించడమే లక్ష్యం..

విధినిర్వహణ అడ్డుకుంటే కఠినచర్యలు..

జిల్లా ఎస్పీ జానకి షర్మిల..

(ప్రతిపక్షం) నిర్మల్​ జిల్లా ప్రతినిధి, మే 12: పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టుగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఆదివారం ముదోల్, నిర్మల్ నియోజకవర్గాల పోలింగ్​ సిబ్బందికి ఈవీఎంల పంపిణీ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది, అధికారులు, రూట్ మొబైల్ ఇన్​చార్జిలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. ఎన్నికల విధులలో సిబ్బంది అలసత్వం చూపరాదని, ఎన్నికల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే అధికారులు ఏదైనా సమస్య ఉందని సమాచారం వచ్చిన వెంటనే దగ్గర లో ఉన్న రూట్ మొబైల్ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందనన్నారు. పోలింగ్​ కేంద్రాల వద్ద సిబ్బంది విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

Spread the love

Related News