Trending Now

కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి : మధుయాష్కీ గౌడ్

ప్రతిపక్షం, ఎల్బీనగర్, మే 14: ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు డివిజన్ అధ్యక్షులు, పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం లోని 11 డివిజన్ల ఇన్చార్జిలు, డివిజన్ అధ్యక్షులతో సమీక్ష సమావేశాన్ని మంగళవారం వనస్థలిపురంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి పోలింగ్ ముగిసేంతవరకు కార్యకర్తలు అందరూ ఎంతో శ్రమించి పనిచేశారని వారందరికీ అభినందనలు తెలిపారు. పోలింగ్ ముగిసింది అన్న భావనతో నిర్లక్ష్యంగా ఉండకూడదని, అసలు ప్రక్రియ అంతా కౌంటింగ్ వరకు కొనసాగుతూ ఉంటుందన్నారు.

కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏజెంట్ల నియామకం, వారికి పాసులు పొందడం, పోలీస్ వెరిఫికేషన్ తదితర ప్రక్రియ అంత డివిజన్ల ఇన్చార్జులు, అధ్యక్షులు పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిన్న జరిగిన పోలింగ్ సంబంధించిన ఓటింగ్ సరళి, కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు తదితర అంశాలపై డివిజన్ అధ్యక్షులు ఇన్చార్జి ల నుంచి సమాచారం సేకరించారు. ఓటింగ్ శాతానికి సంబంధించిన 17 సీ ఫామ్ ను వారి నుంచి కూడా సేకరించారు. ఎన్నికల చీఫ్ ఏజెంట్ చలకాని వెంకట్ యాదవ్ , నాయకులు తులసి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కౌంటింగ్ సంబంధించి ఏజెంట్ల నియామకంతో పాటు చేపట్టాల్సిన ప్రక్రియను వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జిలు వజీర్ ప్రకాష్ గౌడ్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కార్పొరేటర్ సుజాత నాయక్, డివిజన్ల అధ్యక్షులు మకుటం సదాశివుడు, వేణుగోపాల్ యాదవ్, చెన్నగోని రవి, బుడ్డ సత్యనారాయణ, కిషోర్ గౌడ్, కుట్ల నర్సింహా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News