Trending Now

IPL 2024 : నేడు నామమాత్రపు మ్యాచ్.. రాజస్థాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్ ‘ఢీ’

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్లేఆఫ్స్ బెర్తుల కోసం నువ్వానేనా అన్నట్లు సాగుతున్న IPL పోరులో నేడు ఓ నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ప్లేఆఫ్స్‌లో బెర్తు ఖరారు చేసుకున్న రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి టాప్2లో ఉండాలని రాజస్థాన్ భావిస్తుంటే.. టాప్ టీమ్‌ RRను ఓడించి అభిమానులకు అసలైన మజా ఇవ్వాలని పంజాబ్ చూస్తోంది.

లక్నోపై ఢిల్లీ గెలుపు..

ఢిల్లీలో నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నోపై ఢిల్లీ గెలుపొందింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 189 పరుగులకే పరిమితమైంది. పూరన్(61), అర్షద్ (58) రాణించారు. రన్ రేట్ పేలవంగా ఉన్న లక్నో.. మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ ఐపీఎల్ నుంచి దాదాపు నిష్క్రమంచినట్లే. ఢిల్లీ 14 పాయింట్లకు చేరుకున్నా నెగిటివ్ రన్ రేట్ కారణంగా ఇతర ఫలితాల మీద ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉంది.

ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న రాజస్థాన్ రాయల్స్..!

లక్నోపై ఢిల్లీ గెలవడంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. పేలవమైన రన్ రేట్ కారణంగా ఏదైనా అనుకోని అద్భుతం జరిగితే తప్ప.. ఢిల్లీ, లక్నో రెండూ కూడా ప్లే ఆఫ్స్ రేసులో నుంచి వైదొలగినట్లే. ఇక రేసులో ఉన్న 3 జట్లలో హైదరాబాద్‌ 18 పాయింట్లకు చేరుకునేందుకు ఛాన్స్ ఉంది. చెన్నై, ఆర్సీబీ రెండింటిలో ఏదో ఒక జట్టే ప్లే ఆఫ్స్‌కు వస్తుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ స్పాట్ ఖరారు చేసుకుంది.

Spread the love

Related News

Latest News