సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
హైదరాబాద్, ప్రతి పక్షం స్టేట్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షించారు. ధాన్యం కొనుగోలుతో పాటు ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యం సేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశించారు.
రుణమాఫీకి కార్యాచరణ మొదలు..
పండ్రాగస్ట్ లోగ రుణమాఫీకి చేస్తాననంటూ సీఎం ఇచ్చిన హామీ మేరకు కార్యాచరణ మొదలుపెట్టారు. సీఎం తన ఛాలెంజ్‌ను నెరవేర్చుకునే పనికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఏడు లక్షల మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం రూ. 32 వేల కోట్ల వరకు ప్రభుత్వనికి నిధులు అవసరమవుతాయి. త్వరలో రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుపై చర్చించారు. తద్వారా ఆర్బీఐ నిబంధలకు లోబడి ఎఫ్ఆర్బిఎం పరిధిలో లోన్ తీసుకొనేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సాధ్యా సాధ్యాలపై ఈ సమీక్ష లో బ్యాంకర్లు , వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చర్చించినట్లు తెలిసింది. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర పై, రైతు పండించే వాటిని రేషన్ షాపుల్లో అందించే అంశం పైన చర్చించారు. కొత్త రేషన్ జారీ తేదీని క్కారరు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రస్తుతం పలు విభాగాల్లో హెచ్‌ఓడీ లుగా పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులపై కేబినెట్‌లో చర్చించినాట్లు తెలిసింది.