Trending Now

మురికి నీటిలోనే కూరగాయల విక్రయాలు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 15 : జిల్లా కేంద్రమైన నిర్మల్ లో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రధాన కూరగాయల మార్కెట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కూరగాయల విక్రయ సముదాయాలు సరిపోకపోవడంతో ప్రతిరోజు తెల్లవారుజామున తండోపా తండాలుగా తమ క్రయ,విక్రయాలు జరుపుకునేందుకు వస్తున్న కూరగాయల వ్యాపారులు, కొనుగోలుదారులతో ఈ ప్రాంతం కిటకిటలాడుతుంది. అయితే సదరు ప్రధాన కూరగాయల మార్కెట్ ఉన్న షెడ్లలో తగిన విధంగా సౌకర్యాలు లేకపోగా విక్రయ దారుల సంఖ్యకు అనుగుణంగా విక్రయ కేంద్రాలు కూడా లేకపోవడంతో వారు నిత్యం పడరాని పాటుపడుతున్నారు. దాంతో ఇందిరానగర్ ప్రధాన రహదారిపై రోజువారి వందల మంది వ్యాపారులు తమ వ్యాపారాలను అష్ట కష్టాల మధ్య కొనసాగిస్తున్నారు.

గాంధీ పార్క్ ఇందిరానగర్ ప్రధాన రహదారికి ఇరువైపులా చిరు కూరగాయల వ్యాపారులు వ్యాపారాలు చేసుకుంటుండగా ఇటు గుండా పాడుతున్న మురికి నీటి కాలువ సరిగా పారకపోవడంతో చెత్తాచెదారం నిండిపోయి ఆ మురికి నీరంతా ప్రధాన రహదారిపై పారుతుంది. దుర్గంధ భరితమైన సదరు పరిసరాలలోనే నిర్మల్ వాసులు తమకు కావాల్సిన కూరగాయాలను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు విక్రయాలు చేస్తున్నారు.ప్రధాన కూరగాయల మార్కెట్ లోనే నిర్మల్ పబ్లిక్ హెల్త్ సాంకేతిక నిపుణుల కార్యాలయం ఉండడం కోసం మెరుపు.

Spread the love

Related News

Latest News