ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తన ఎగ్ ఫ్రీజింగ్ ప్రకటనపై తప్పుడు పోస్టులు చేసినవారు వాటిని తొలగించి, క్షమాపణ చెప్పాలని హీరోయిన్ మెహరీన్ డిమాండ్ చేశారు. ఫ్రీజింగ్ ఎగ్స్ కోసం గర్భవతులు కానవసరం లేదని మండిపడ్డారు. ఇప్పుడే పిల్లలు వద్దని భావించే వారికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందన్నారు. తల్లి కావడం కోసం తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంటున్నట్లు మెహరీన్ ఇటీవల పోస్ట్ పెట్టారు. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. నేను చేసిన వీడియోని చాలా మీడియా సంస్థలు సగం సగం నాలెడ్జ్‌తో మరో విధంగా తమ వార్తా పత్రికల్లో, ఛానళ్లలో ప్రజెంట్ చేశారని మెహరీన్ చెప్పుకొచ్చింది. పైగా నేను పెళ్లి కాకుండానే గర్బవతిని అయ్యానంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాంటి వార్తలు వ్రాసే వారికి, అయా సంస్థలకు తమ వృత్తిపై నిబద్దత ఉండాలని, ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేర వేయొద్దని తెలిపింది. నాపై ఫేక్ వార్తలు ప్రచారం చేసిన వారు వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పి, ఆ పోస్టులను తొలగించాలంటూ డిమాండ్ చేసింది. త్వరలోనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని హెచ్చరించింది.