ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ కాయగా.. మధ్యాహ్నానికి నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. కొండాపూర్, కూకట్‌పల్లి, నిజాంపేట్, బాచుపల్లి, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మణికొండ, షేక్‌పేట, గచ్చిబౌలి, ఖైరతాబాద్, దిల్‌సుఖ్‌నగర్, లక్డీకపూల్, పంజాగుట్ట తదితర ఏరియాల్లో వాన పడుతోంది. దీంతో నగరంలోని రోడ్లు నీటితో నిండిపోయాయి. ఫలితంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులను మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అప్రమత్తం చేశారు.
మ్యాన్ హోల్స్ వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేసి అక్కడ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరో రెండు గంటలు భారీ వర్షం ఉన్న నేపథ్యంలో నగరవాసులు అవసరమైతేనే బయటకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.