Trending Now

వారపు సంతలో మౌలిక వసతులు కల్పించాలి..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 17 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలలో ప్రతి వారానికోసారి నిర్వహించుకునే వారపు సంతలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ ఖానాపూర్ ఏఐఎంఐఎం శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు శుక్రవారం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణ ఇంచార్జ్ అఖిల్, నియోజకవర్గం సమన్వయకర్త మహమ్మద్ అప్సర్ ఖాన్, మండల నాయకులు షారుఖ్ తదితరులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఖానాపూర్ పట్టణ నడిబడ్డున నిర్వహిస్తున్న వారపు సంతలో కనీస వసతులు లేక అటు కూరగాయల విక్రయాలు చేసే వ్యాపారాలు కొనుగోలుదారులు పడరాని పాట్లు పడుతూ అష్ట కష్టాల మధ్య కాలాన్ని వెల్లదీస్తున్నారని చెప్పారు. వారపు సంతను ఖానాపూర్ పట్టణ పురపాలక శాఖ ఆధ్వర్యంలో క్రమ పద్ధతిన చిరు వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసి ఎలాంట సమస్యలు లేకుండా వ్యాపారాలు సకాలంలో కొనసాగించుకునేలా చూడాలన్నారు. వారపు సంతలో కనీస వసతులైన మరుగుదొడ్లు, మూత్రశాలలు, మంచినీటి సౌకర్యాలు లేకపోవడంతో సంతకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనికి తోడు వారపు సంత ఉన్న నాడు సమీపంలోనే ఉన్న ప్రధాన ఆసుపత్రికి అత్యవసరంగా వెళ్లే వాహనాలుదారులు, పాదచారులు సకాలంలో తమ గమ్యాలకు చేరుకోలేక వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఈ విషయంలో ముఖ్యంగా ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలను గుర్తించి పట్టణ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. సంతకు వచ్చే వందలాది వాహనాలు నిలిపినందుకు తగిన విధంగా ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పాత తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న సమీకృత ప్రధాన కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి పట్టణవాసులకు సహకరించాలని కోరారు. ఇప్పటికే ఈ విషయమై ఏఐఎంఐఎం ఖానాపూర్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ,సంబంధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులకు ఆధారాలతో సహా విన్నతులు సమర్పించుకున్న కనీస స్పందన లేకపోవడం ఆందోళనను కలగ జేస్తుందని పేర్కొన్నారు. సంతలో ఏర్పడుతున్న సమస్యలను వెంటనే గుర్తించి స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని తగిన విధంగా సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు పలువురు ఏఐఎంఐఎం ఖానాపూర్ పట్టణ శాఖ ఆయా విభాగాల పదాధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News