Trending Now

అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్..

ప్రతిపక్షం, షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరి గూడ మండలంలో ఓ రైతు బ్రతికుండగానే చనిపోయాడని ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆ రైతు భూమిని మరొకరికి విరాసత్ చేసిన ఘటనలో గడ్డం వెంకటయ్య ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరిగూడా మండలంలో గతంలో తహాశీల్దారుగా పనిచేసిన విజయ్ కుమార్ తో పాటు 8 మంది పై చౌదరిగుడా మండల పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిపై 420,419,467, 468,471, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో కేవలం ఇద్దరు మహిళలను మాత్రమే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

నిన్న మరో నిందితుడిగా ఉన్నజంగయ్యను తిరుపతి లో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పోలీసులు శుక్రవారం శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఆ తహశీల్దార్‌ను మాత్రం అరెస్టు చేయ్యలేదు. దీనిపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చౌదరిగుడా మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన గడ్డం వెంకటయ్యకు సర్వే నెంబర్ 222/3 లో 20 గుంటల సీలింగ్ పట్టా 16 /26/2లో 10 గుంటల భూమి ఉంది. గత కొన్నిరోజులుగా రైతుబంధు డబ్బులు రాకపోవడంతో అధికారులను కలిశాడు. రైతు వెంకటయ్య అసలు భూమే తన పేరు మీద నుండి మరొకరికి విరాసత్ అయినట్టు అధికారులు చెప్పడంతో దానికి తోడు రైతు వెంకటయ్య మరణించినట్లు ధృవీకరణ పత్రాలు జత చేసి 30 గుంటల భూమిని వేరే వ్యక్తుల పేరిట అధికారులు విరాసత్ చేసి పట్టా మార్పిడి చేశారని తేలడంతో రైతు వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మహిళలైనా గాయత్రి, మమత ను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. శుక్రవారం మరో వ్యక్తి జంగయ్య ను అరెస్ట్ చెయ్యగా తహశీల్దార్ ను ఎందుకు అరెస్టు చేసి రిమాండ్ చేయ్యడం లేదనే నియోజకవర్గ స్థాయిలోను విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ కేసులో తహశీల్దార్ తో పాటు షాద్ నగర్ కు చెందిన ఓ న్యాయవాది కూడా ఉండడం మరిన్ని విమర్శలకు దారి తీస్తుంది.

Spread the love

Related News

Latest News