Trending Now

నిర్మల్‌లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 21 : దేశాన్ని సాంకేతిక విద్య వైజ్ఞానిక రంగాలలో ముందుకు తీసుకెళ్లిన ఘనత దివంగత ప్రధాని రాజీవ్ గాంధేనని పలువురు నాయకులు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ డీసీసీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 34 వర్ధంతి కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. గాంధీయవాద సిద్ధాంతాలకు కట్టుబడి దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళెందుకు రాజీవ్ గాంధీ చేసిన ప్రయత్నాలు సఫలకృతమయ్యాయని చెప్పారు. రాజీవ్ గాంధీ ప్రత్యేక కృషి ఫలితంగానే దేశం ఈరోజు సాంకేతిక, విద్య, వైజ్ఞానిక రంగాలలో వేగంగా ముందుకు దూసుకెళ్తున్నదని గుర్తు చేశారు.

దేశ స్వాతంత్రం కోసం దేశ అభివృద్ధి కోసం తమదైన రీతిలో రాజీవ్ గాంధీ కుటుంబ సభ్యులు త్యాగాలు చేయడం జరిగిందన్న విషయాన్ని సమాజం గుర్తించాలన్నారు. యువతకు సముచిత ప్రాధాన్యతనిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువ మొత్తంలో కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ఇదేనని చెప్పారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండి ఆయన పాలన కాలాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

రాజీవ్ గాంధీ అమర్ రహే అంటూ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ జిల్లా జడ్పీటీసీల ఫోరం అధ్యక్షులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి , సయ్యద్ అర్జుమంద్, కాంగ్రెస్ పార్టీ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను, కొట్టే శేఖర్, నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అల్లూరి మల్లారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఎంబడి రాకేష్, మున్సిపల్ కౌన్సిలర్లు మొహమ్మద్ అన్వర్ పాష, అబ్దుల్ మతిన్, శేఖ్ సయిద్ (సలీం) ఎంబరి గంగయ్య, బోరాజ్, ఆరే చిరంజీవి తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News