Trending Now

దిలావర్ పూర్ డబుల్ బెడ్ రూమ్‌ల వద్ద ఉద్రిక్తత..

32 ఇందిరమ్మ ఇళ్లను ఆక్రమించుకున్న బాధితులు

జిల్లా కలెక్టర్ ఆదేశంతో ఇంద్రమ్మ ఇళ్ల ఖాళీ

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 21 : నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో నిర్మించిన 32 ఇందిరమ్మ ఇళ్ళను ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండానే ఇల్లు లేని బాధితులు 20 రోజుల క్రితం ఆక్రమించుకొని అందులో నివాసం ఉంటున్నారు. కొంతమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్, స్థానిక ఎంఆర్ఓ సంబంధిత అధికారులకు ఆ ఇంద్ర మహిళను వెంటనే ఖాళీ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంగళవారం స్థానిక ఎంఆర్ఓ తగిన పోలీస్ బలగాలతో ఇంద్రమ్మ ఇళ్ల వద్దకు చేరుకొని అక్రమంగా ఇళ్లను ఆక్రమించుకొని ఉంటున్న వారు ఇళ్లను ఖాళీ చేయాలని సూచించిన వారు పట్టించుకోకుండా ఘర్షణలకు దిగారు. అధికారులు బాధితుల మధ్య సుమారు గంటన్నర పాటు వాదోపవాదాలు జరిగాయి. పోలీస్ బలగాలతో ఎంఆర్ఓ ఇండ్ల నుండి బాధిత కుటుంబాల సామాగ్రిని బయటకు తీసి సదర్ ఇండ్ల తాళాలు వేసేందుకు అధికారిక పద్ధతులను ముందుకెల్లగా వారిని బాధిత కుటుంబాలు అడ్డుకొని ఆందోళనకు దిగాయి.

అసలు ఏమి జరిగింది..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి స్థానిక అధికారులు పాలకుల ప్రత్యేక కృషితో గ్రామంలో 32 డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాలకు పునాదులు వేశారు. నిర్మాణ పనులు దాదాపు అనగా 80 శాతం వరకు పూర్తయ్యాయి. అయితే శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అప్పటి ప్రభుత్వం అర్హులైన వారికి ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీ కోసం దరఖాస్తులను స్వీకరించింది. మూడు దఫాలుగా అర్హులైన వారి నుండి దరఖాస్తులను స్వీకరించిన సంబంధిత శాఖల అధికారులు అర్హులైన వారి జాబితా కోసం పలుమార్లు సర్వేలు కూడా నిర్వహించారు. అర్హులైన వారికి 32 ఇళ్ల పంపిణీ కోసం తగిన ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే శాసనసభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో లాంఛనంగా నిర్వహించుకోవలసిన ఇంద్రమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. దిలార్పూర్ మండల కేంద్రంలో ఇల్లు లేని అర్హలైన ఆయా సామాజిక వర్గాల వారు సుమారు 75కు పైగా కుటుంబాలు ఉండగా 32 ఇండ్ల నిర్మాణాలు చేపట్టడంతో ఇండ్ల పంపిణీ స్థానిక అధికారులు ప్రజా ప్రతినిధులకు తలనొప్పిగా ఉండిపోగా సమస్యాత్మకంగా మారింది.

20 ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటున్నాం..

కడు పేదరికంతో అష్ట కష్టాల మధ్య కుటుంబ భారాలను మోసుకెళ్తున్న మేము శాశ్వత పక్కా సొంత గృహాలు లేక 20 యేళ్ళుగా అద్దె ఇళ్లలోనే ఉంటున్నాం. గత ప్రభుత్వంలో తమకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని నాలుగైదు సార్లు దరఖాస్తులు తీసుకున్న సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అది ఇవ్వకపోవడం బాధను కలగజేస్తుంది. సర్వేల ద్వారా ఎంపిక చేసిన అధికారులు అరులైన వారికి ఇల్లా పంపిణీ చేయకపోవడం లో చేస్తున్న జాప్యంతోనే బలవంతంగా ఇళ్లలోకి వచ్చి ఉంటున్నాం తమకు పాలకులు, అధికారులే భద్రత కల్పించాలి. పిల్లా పాపాలతో 20 రోజులుగా ఇళ్లలో ఉంటున్న తమకు బలవంతంగా ఖాళీ చేయించడం సరికాదని వారు వాపోయారు.

Spread the love

Related News

Latest News