ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్ ,మే 21 : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మలక్ చించోలి గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన నిర్వహించారు. సారంగాపూర్ ఎస్సై చంద్రమోహన్ మాట్లాడుతూ.. సంఘవిద్రోహక శక్తులపై నిగాపెట్టడమే కాకుండా చట్టపరమైన విషయాల పట్ల వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి అన్నారు. సైబర్ నేరాల పట్ల యువత ముఖ్యంగా అవగాహన కలిగి ఉన్నప్పుడే సైబర్ ద్వారా ఎలాంటి నేరాలకు పాల్పడక జాగ్రత్తలు తీసుకోవచ్చునని సూచించారు. వాహన యజమానులు వాహన చోదకులు కచ్చితంగా పోలీస్ రవాణా శాఖ ద్వారా జారే ధృవీకరణ పత్రాలను కలిగి ఉండడంతో పాటు సంబంధిత నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. చట్ట విరుద్ధ కార్యకర్తలకు ఎలాంటి వారైనా పాల్పడిన వారిపై కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు భవిష్యత్తులో జరగనున్న స్థానిక ఎన్నికలలో ఎన్నికల కోడ్ కు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. శాంతి సామరస్యాల మధ్య ఎన్నికలలో భాగస్వాములయే వారందరూ రాజ్యాంగబద్ధంగా వివరించాలని కోరారు. అనుమానితులపై నిఘా పెట్టి ఎలాంటి అనుమానం ఉన్నరహస్యంగా తమకు సమాచారం అందిస్తే తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని భరోసా కల్పించారు. గ్రామాలలో అన్ని వర్గాల వారు కలిసిమెలిసి ఉండేలా సమైక్య ,శాంతియుత వాతావరణాన్ని రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట పలువురు పోలీస్ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.