కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి
ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రెండు రోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర చేస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు సన్నాలు, దొడ్డు ఓట్లు ఎంత రైతులు పండిస్తారో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. సన్నలు ఈ ఏడాది 14 లక్షల ఎకరాలు, 32 లక్షల దొడ్డు ఒడ్లు పండిస్తున్నారు. రైతులను ఆదుకునే ఉద్దేశ్యం తో ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. సన్నలకు, దొడ్డు వడ్లకు కేంద్రం ఓకే ధర ఇస్తుంది. సన్నలకు ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి మిల్లర్లు అదనపు ధర తో కొనుగోలు చేస్తున్నారు. కేసీఆర్ కూడా జనగామ ఎన్నికల ప్రచారంలో సన్నలకు 150 బోనస్ ఇస్తాం అని అన్నారు. బాయిల్డ్ రైస్ మాత్రమే కేంద్రం తీసుకుంటున్నది.. దొడ్డు వడ్లు మాత్రమే బయిల్డ్ రైస్ వస్తుంది. 24 లక్షల మెట్రిక్ టన్నులు ఏడాదికి రేషన్ బియ్యం ప్రజలకు అందిస్తున్నాం. ఆ రేషన్ బియ్యం మిల్లర్ల వద్ద రీసైక్లింగ్ అవుతుంది. PDS ద్వారా సన్నలు ఇవ్వాలి అంటే ఇక్కడ సన్నల పంట అవసరం. సన్నలలో అనేక తేడాలు ఉంటాయి. BPT లో మాత్రమే నూక శాతం ఎక్కువ ఉంటుంది. ఇతర రకాలలో దిగుబడి రెండు కిలోల తేడా మాత్రమే ఉంటుంది.
రాష్ట్రంలో సన్నాలు పండించే అవకాశాలు ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి సన్నలు దిగుమతి చేసుకుంటున్నాం. దొడ్డు వడ్లు పండించే రైతులను ఆదుకునే భాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం తప్పక ఆదుకునే ఆలోచన చేస్తుంది. రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవ్వాళ రైతులకు మూడు రోజులలోనే ప్రభుత్వం సేకరించిన ధాన్యం డబ్బులు వస్తున్నాయి. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. గతంలో ఐదు నుంచి పది కిలోల తరుగు తీశారు. రైతులకి కాంగ్రెస్ పాలనలో లబ్ధి జరుగుతుంది. తడిసిన ధాన్యం కూడా తరుగు లేకుండా కొనుగోలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో మిలర్లతో కుమ్మక్కై వేల కోట్లు దోచుకోలేదా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వండి స్వీకరిస్తాం. కేసీఆర్ మొదట సన్నకు వేయమన్నారు.. తర్వాత వరి వేస్తే ఉరే అన్నారు.. కేంద్రం మెలిక పెట్టింది అని తప్పించుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన తప్పులు చేశారు, కాబట్టి మిగిలిన వారు అలానే చేశారు అనుకుంటున్నాడు.