ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 22 : నిర్మల్ మున్సిపల్ పూర్వపు కమిషనర్ పై ఏకంగా సస్పెన్షన్ వేటు పడింది. 2022 లో నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలపై అప్పటి నిర్మల్ మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ అయ్యారు. అప్పట్లో నిర్మల్ మున్సిపల్ లో జరిగిన ఉద్యోగాల భర్తీ అవకతవకల ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రోస్టర్ పద్ధతులలో నియామకాలు చేయవలసిన 44 పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఉద్యోగాల భర్తీలలో 43 పోస్టులను అక్రమ మార్గాలలో అప్పటి స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై చేపట్టారని ఆధారాలతో సహా కొంతమంది బాధితులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అర్హులైన వారిని కాకుండా అనర్హులైన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారన్నా ఆరోపణలపై పలు ప్రముఖ ఆయా భాషాల పత్రికలు, టీవీ ఛానల్ లలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. 15 రోజుల క్రితం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అప్పటి నిర్మల్ మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు జైలు శిక్ష వేస్తూ తీర్పునివ్వడం కూడా జరిగింది.ఈ మేరకు రాష్ట్ర కృపాలక శాఖ ఉన్నత స్థాయి అధికారులు బుధవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం అప్పటి నిర్మల్ మున్సిపల్ కమిషనర్ రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ గా పని చేస్తున్నారు.